బాసర ట్రిపుల్ ఐటీలో మరణాలపై నివేదిక కోరిన గవర్నర్ తమిలిసై

  • 48 గంటల్లో ఇద్దరు విద్యార్థుల మృతి పట్ల నివేదిక ఇవ్వాలి
  • విద్యార్థుల కోసం ముందు జాగ్రత్తగా ఏమి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలి
  • తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై దిగ్బ్రాంతి

హైదరాబాద్, జూన్ 16 (విశ్వం న్యూస్) : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక ఇవ్వాలని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ విసి వెంకటరమణను కోరారు.ఈ మేరకు 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇంచార్జీ ఆదేశించారు. దురదృష్టకర ఘటనల నివారణకు చేపట్టిన చర్యలపై కూడా నివేదిక సమర్పించాలని గవర్నర్ కోరారు.

అదేవిధంగా ఎలాంటి అవరోధాలు ఎదురైనా విద్యార్థిని విద్యార్థులు నిలబడి ఎదిరించాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యాలపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్ చాన్సలర్ కు గవర్నర్ సూచించారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని ఆమె కోరారు.ఇది ఇలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందారు.

ఈ నెల 13వ తేదీన బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. మరుసటీ రోజే 15వ తేదీన తెల్లవారుజామున లిఖిత అనే విద్యార్ధిని అనుమానస్పదంగా నాలుగో అంతస్తు బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందింది. బాసర ట్రిపుల్ ఐటీలోని హస్టల్ భవనం నాలుగో అంతస్థుపై నుండి కిందపడి లిఖిత మృతి చెందింన విషయం అందరికి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *