జీతాలు రాక బిచ్చ మేత్తుకుంటున్న గ్రామ పంచాయతీ సిబ్బంది
- యం.పి.డి.ఓ ఆఫీస్ ఎదుట వినూత్న నిరస కార్యక్రమం
ఖమ్మం, మార్చి 14 (విశ్వం న్యూస్) : జీతాలు రాక ఆత్మహత్యలు, బిచ్చ మేత్తుకుంటున్న గ్రామ పంచాయతీ సిబ్బంది బంగారు తెలంగాణలో పంచాయతీ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని పస్తులుంటూ సిబ్బంది పనిఎట్లా చేస్తారని తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాదపాలెం మండలం యం.పి.డి.ఓ కార్యాలయం ఎదుట గిన్నెలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పొందేది అతికొద్ది జీతాలు అవి సక్రమంగా నెల నెలా ఇవ్వకుండా నెలలు గడపడంతొ పరిస్థితి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ పస్తులుంటూ పనిచేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటున్న పాలకులు పంచాయతీ సిబ్బందికి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా అన్నారు. పస్తులతో గ్రామాల్లో పనిచేరలేక కుటుంబ పోషణ బారమై రాష్ట్రంలో పంచాయతీ కార్మికుడు తన కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలిన సంఘటన కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి వెంటనే జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించకుంటే సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ పంచాయతీ పంచాయతీ సిబ్బంది జీతాల సమస్య తెలుసుకొని పరిష్కారం చూపాలని లేనిఎడల జరిగే పరిణామాలకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెండింగ్ జీతాల కోసం, గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, ట్రాక్టర్ నడిపే కార్మికులకు ప్రభుత్వమే లైసెన్స్ లు ఇప్పించాలని, ఇయస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ. 24 వేలుగా పెంచాలని, అర్హత కలిగిన బిల్ కలెక్టర్లను కారోబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని తదితర డిమాండ్ల సాధన కోసం నిర్వధిక సమ్మె బాట పడతామని అందుకు మండల వ్యాప్తంగా సిబ్బంది సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు గుగులోతు రాందాస్, యం. రాజగోపాల్, బాణోతు.మంగీలాల్, పెనుగూరి. సీతారాములు, అర్వపల్లి శ్రీను, వెంకన్న, జి.విజయ్, ఉపేందర్, రామకృష్ణ, జేల్యా, కోటేశ్వరరావు, రాజు, వీరన్న, డి.బిక్షం, ప్రసాద్, డి.సుమన్, అర్వపల్లి కృష్ణ, బి.నాగేష్, యన్. మోహన్, తదితరులు పాల్గొన్నారు.