వీణవంక:ఘనంగా బండి
సంజయ్ జన్మదిన వేడుకలు

వీణవంక, జూలై 11 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ బిజెపి నాయకులు జమ్మికుంట అనాధ ఆశ్రయంలో పిల్లల చేత కేక్ కటింగ్ చేయించి అరటి పండ్లు మరియు స్వీట్ పంపిణీ చేశారు.
లస్మక్కపల్లి బూత్ అధ్యక్షులు మద్దుల ప్రశాంత్ మరియు BJYM మండల కార్యదర్శి గెల్లు ఓం ప్రకాష్ మాట్లాడుతూ బండి సంజయ్ కి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండి ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టి ప్రదీప్, లింగాల సాయి, వంశీ, శ్రీకాంత్, గెల్లు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.