ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

- పాల్గొన్న మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
హుజురాబాద్, జనవరి 26 (విశ్వం న్యూస్) : రిపబ్లిక్ డే విశిష్ట మైన రాజ్యాంగాన్ని ఆవిష్కరించి భారత దేశ అభివృద్ధికి సోపానాలు వేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నివాళులు అర్పిస్తూ తెలంగాణ స్టేట్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం తెలంగాణ స్టేట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జెడ్ పి హై స్కూల్ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదివిన చదువులతో మీ యొక్క భవిష్యత్ రాబోయే కాలంలో బాగుండాలని మంచి స్థాయిలో మీరందరూ ఎదగాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

హుజురాబాద్ పట్టణంలో మజ్జిద్ బషీర్ మోమిన్ పురవాడలో దారులు ఉలూమ్ పాఠశాలలో ఇక్కడ ఖురాన్ షరీఫ్ చదువుతున్న బాల బాలికలకు ఉద్దేశించి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నుండి దారులు ఉలూమ్ పాఠశాలలో ఖురాన్ షరీఫ్ చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీయొక్క భవిష్యత్తు చక్కగా ఉండాలన్న మీరు కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాంతంలో మసీదులలో ఇమామ్ గా పని చేసే అవకాశం ఉంటుంది ఈ విద్యాభ్యాసంతో పాటు ఇంగ్లీష్ మరియు తెలుగు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు.

రేపటి కాలంలో ఎక్కడనో ఒక కాడ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు పనిచేసే అవకాశం కూడా మీకు కలుగుతుందని కనుక మంచిగా శ్రద్ధగా చదివి ఈ యొక్క భవిష్యత్తును కూడా చక్కదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ క్రికెట్ టీం మరియు కబడ్డీ టీం విద్యార్థి విద్యార్థినీయులకు షిల్డ్ బహుమతులు గెలిచిన టీం వారికి అందజేయడం జరిగింది అనంతర హుజురాబాద్ పట్టణంలో ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో రిపబ్లిక్ డే జెండా ఇనాగరేషన్ కార్యక్రమంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.