ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై
అదిరపోయే అప్ డేట్

- మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారులు తమ పనులను ప్రారంభించి పునాది వరకు పూర్తిచేస్తే, వారి ఖాతాలో రూ. 1 లక్ష జమ కానుంది.
- మొదటి విడతలో 562 పంచాయతీలకు చెందిన 71,482 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వీరందరికీ ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గత నెల 21వ తేది నుంచి ప్రారంభమైన ఈపథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం వారికి రూ.లక్ష నగదును జమ చేయనుంది.

నిధుల విడుదల విధానం
ప్రోసిడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు తమ నిర్మాణ పనులు ప్రారంభించారు.
పునాది దశ పూర్తయిన వెంటనే, తొలి విడత కింద వారి ఖాతాల్లో రూ. లక్ష జమ అవుతుంది.
మొత్తం నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) నిధుల భాగస్వామ్యం కూడా ఉంటుంది.
అయితే, మొదటి విడత కింద ఇచ్చే రూ. లక్షను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది.
పనుల పరిశీలన & నిధుల కేటాయింపు
పునాది నిర్మాణం పూర్తయిన వెంటనే, అధికారులు స్థలాన్ని పరిశీలిస్తారు.
పనుల ఫొటోలు తీసి అప్లోడ్ చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 1,000 కోట్లు కేటాయించింది.

దరఖాస్తుల పరిశీలన & కేటగిరీల విభజన
ప్రభుత్వం అందిన దరఖాస్తులను మూడు విభాగాలుగా వర్గీకరించింది:
L1 – సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేనివారు.
L2 – స్థలం, ఇల్లు రెండూ లేనివారు.
L3 – అద్దె ఇళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో నివసిస్తున్నవారు.
ప్రభుత్వం మొదటి దశలో L1 కేటగిరీకి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. రెండో దశలో స్థలం కూడా లేని వారికి ఇల్లు నిర్మాణ సహాయం అందించనుంది.
ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్దిదారులు పునాది వరకు వేసిన తర్వాత ఆఫోటోలను ఆన్లైన్లో అప్ లోడ్ చేయగానే రూ.లక్ష నగదును ఇస్తుంది ప్రభుత్వం. సర్కారు ఇచ్చే మొత్తం 5లక్షల్లో ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు కూడా కలిపే ఉంటాయి. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్ధిక సాయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్లను సిద్దంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.