కరీంనగర్:నిరుపేదలకు
పనికిరాని గృహలక్ష్మి పథకం

- దొంగ దొంగ అంటే భుజాలు పునుకుంటున్న బండి సంజయ్.
- సెక్యూరిటీ డిపాజిట్ పేరు మీద వినియోగ దారులపై భారం వేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
- ప్రభుత్వ ఉద్యోగులచే బలవంతంగా దశాబ్ది ఉత్సవాలు జరిపిండ్రు
- గంగుల కమలాకర్ పాలన, పైన పటారం, లోన లొటారం
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, జూన్ 24 (విశ్వం న్యూస్) : బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేయడానికి గృహలక్ష్మి పథకం తీసుకువచ్చిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 లో ఇల్లులేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ కట్టియ్యక పోగా మళ్లీ 2018 లో మరొక సారి మోసం చేసి తరువాత అయిదు లక్షలు ఇస్తామని చెప్పి ఆహామీ కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయని గృహలక్ష్మి పథకం పేరుతో మళ్లీ మోసానికి తెర లేపారని నరేందర్ రెడ్డి అన్నారు.స్థలం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని అది కూడా మూడు విడతలు ఇస్తామని నిబంధనలు పెట్టారని,నగరంలో స్థలం ఉన్న వారు ఎందరుంటారనీ స్థలం కొనుక్కోవాలి అంటే లక్షలు వెచ్చించే స్థోమత ఎందరికి ఉంటుందనీ నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.ఇది నిరుపేదలకు పనికొచ్చే పథకం కాదన్నారు.కెటీఆర్ కేంద్ర మంత్రులను కలిస్తే బండి సంజయ్ కుమార్ రాజకీయ కోణంలో చూడద్దు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కవితను అరెస్టు చేయనప్పుడే ప్రజలు బిఆర్ఎస్,బిజెపి ఒక్కటనే నిర్ణయానికి వచ్చారని ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.బిజెపికి ఓటు వేస్తే ఓటు మురిగిపోయినట్టే అని ప్రజలు భావిస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎనిమిది వేల మంది విద్యుత్ వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ పేరుమీద విద్యుత్ శాఖ నోటీసులు పంపిందని వినియోగ దారుల పై భారం మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వెంటనే రద్దు చేసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడతాం అని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.దశాబ్ది ఉత్సవాలు అధికారులచే బలవంతంగా జరిపించారని ఏశాఖ అధికారులు,సిబ్బంది సంతోషంగా లేరని,జీతాలు పెన్షన్లు ఎప్పుడు పడతాయో అని ఎదురు చూసే పరిస్థితికి ప్రభుత్వాన్ని దిగజార్చిన ఘనత కెసిఆర్ దే అని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కెటీఆర్ కరీంనగర్ పర్యటనలో అంతర్గత రోడ్లు బాగున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.కరీంనగర్ నగరం పైన పఠారం లోన లొటారం అన్న విషయం పాపం కెటీఆర్ కు తెలువదేమో అని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఈ విలేకరుల సమావేశంలో శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దన్న సింగ్,బాలబద్రి శంకర్,జీడీ రమేష్,షబానా మహమ్మద్, ఎండి చాంద్, పోరండ్ల రమేష్, ముక్క భాస్కర్, ఊరడి లత, ముల్కల కవిత, ఎగ్గడి శారద, ఎజ్రా దేవ్, భారీ,మామిడి సత్యనారాయణ రెడ్డి, కీర్తి కుమార్, శారద,మెతుకు కాంతయ్య,కాంపెల్లి కీర్తి కుమార్,కుంబాల రాజ్ కుమార్, ఎండి నదీమ్, హనీఫ్, అజ్మత్,కమల్, యోనా తదితరులు పాల్గొన్నారు.