ఘనంగా భగత్ సింగ్ జయంతి

ఘనంగా భగత్ సింగ్ జయంతి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విశ్వం న్యూస్) : భగత్ సింగ్ నవ యువత వారు హైమావతి నగర్ లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని సన్నిధిలో 9 రోజులు ప్రతినిత్యం గణపతి హోమం, భగవద్గీత పారాయణం, గోమాత సంరక్షణ, పూజ, అన్నదానం, భక్తి మ్యూజిక్ కల్చరల్ ప్రోగ్రామ్స్, మహా హారతి కార్యక్రమాలు చేస్తూ గణనాధుని నిమజ్జనం తదుపరి రోజైనా ఈరోజు భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. గూడూరు చెన్నారెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తన విప్లవ చైతన్యంతో ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని రగిలించిన యువ విప్లవ కిరటం, రెండు పదుల వయసులో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అతి చిన్న వయసులోనే విదేశీయులను భారతదేశ గడ్డపై గడగడలాడించిన భగత్ సింగ్ లాంటి వారిని మరువక వారు చూపించిన దారిలో నేటి యువతరం నడవాలని ఉద్బోధించారు.

ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన పోరాటస్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆర్గనైజేషన్ యూత్ సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గము నుండి రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయబోయే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీమద్బగవద్గీత మరియు జపమాలనుచ్చి వచ్చిన వారిని శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డి. శ్రీరాములు, రాజ్ కుమార్ గౌడ్, ఎం. శివకుమార్, పి. చక్రపాణి, కే. శివకుమార్, కే .రఘు, మరియు భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ మెంబర్స్, విశేషమైనటువంటి బస్తీ మరియు స్థానిక యూత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *