ఆయనే ఒక ప్రభంజనం

  • అనుకరించడం అధముల లక్షణం.
  • చరిత్రను సృష్టించడం ఉత్తముల లక్షణం.
  • బాపు కేసిఆర్ ఒక సృష్టకర్త.

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విశ్వం న్యూస్) : ఆయన మదినుండి అద్భుతమైన పథకాలు,అసమాన్యమైన పోరాటరూపాలు పుట్టుకొచ్చాయి. జన్మభూమి,ప్రజలవద్దకుపాలన వంటి కార్యక్రమాలకు బాపు కేసిఆర్ ఉమ్మడిపాలనలోనే శ్రీకారం చుట్టారు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి బాపు కేసిఆర్ రైతులకు నిజమైన బంధువయ్యారు…..

రైతుభీమా, కళ్యాణలక్ష్మి,షాదిముబారక్, బాలామృతం, కేసిఆర్ కిట్, న్యూట్రిషన్ ఫుడ్ తదితర గొప్ప గొప్ప పథకాలకు బాపు కేసిఆర్ పురుడు పోశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే సాగునీటి ప్రాముఖ్యతను గుర్తించారు. చెరువులను,కుంటలను,వాగులు,వంకలను పునరుద్దరించుటకు మిషన్ కాకతీయ పథకం రూపొందించారు

రైతులకు ఈ పథకం ఒక వరంలాంటిది. బోర్లద్వారా చాలీచాలని నీళ్ళతో సాగుచేసినవారికి మిషన్ కాకతీయ వెలకట్టలేని గొప్ప పథకం. బాపు కేసిఆర్ పాలనలో పదేళ్ళు భూగర్భజలాలు ఉబికివచ్చాయి.
మిషన్ భగరీథ పథకంద్వారా ఇంటింటికి నల్లాలద్వారా తాగునీరిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలు పొందింది….

కోటి ఎకరాల మాగాణంను సాకారంచేసిన అపర భగీరథుడు మా బాపు కేసిఆర్.
మన సాగునీటి హక్కును కాపాడడంలో బాపు కేసిఆర్ ఎనాడూ రాజీపడలేదు.
ఆంధ్రపాలకుల ఆటలు సాగనివ్వలేదు. బాపు కేసిఆర్ హయాంలో జలసంపదతో,పంటరాసులతో కళకళలాడిన మన తెలంగాణ ఈరోజు దుర్భరపరిస్థితిని చవిచూస్తుంది. మన గొంతు ఎండబెట్టి నీళ్ళన్నీ దోచుకుపోతున్నా కిమ్మనకుండా గురుభక్తిని చాటుకుంటున్న పాలకుడి పాలనలో రైతులు గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. బాపు కేసిఆర్ ని ఓడించి తెలంగాణ సమాజం భారీ మూల్యం చెల్లించుకుంటుంది……

మళ్ళీ సారే రావాలని పలువరిస్తుంది. ఈరోజు బాపును చూడాలనీ, తనివితీరా ఆయన మాటలువినాలని ఎగబడుతున్న యువతను, జనాన్ని చూస్తుంటే చాలా సంతోషం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *