మత్స్యకారుల కోసం
హెల్ప్‌లైన్ ప్రారంభం

- ప్రారంభించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.బండా ప్రకాష్ ముదిరాజ్,
- రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్
- హెల్ప్‌లైన్ నెంబర్ 9044480333
హైదరాబాద్, జూలై 10 (విశ్వం న్యూస్) : ఈ జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా హెల్ప్ లైన్‌ను బేగంపేటలోని హరితప్లాజాలో హెల్ప్ లైన్‌ను శాసన మండలి డిఫ్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ప్రారంభించారు. హెల్ప్ లైన్ నెంబర్ 90444 80333ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత పెరిగింది దానికి అనుగుణంగా మత్స్య సంపద కూడా అద్భుతంగా పెరుగుతుంది అని పేర్కొన్నారు. మత్స్య సంపద పంపిణీలో వ్యత్యాసం రాకపోతే బాధ్యులు ఎవరు అని అన్నారు. ఆరు నెలలకు ఒకసారి అయినా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించుకోవాలని కోరారు. సొసైటీలు పరిస్థితులకు అనుగుణంగా వారి ఆలోచన ధోరణిలో కూడ మార్పులు రావాలన్నారు. చాపల ఉత్పత్తి పెరగడంలో నీటి వనరులు పెరగడం కూడ ఒక ప్రధాన కారణం అని గుర్తుచేశారు. పది కిలోల నుండి 20 కిలోలు 30 కిలోల చాపలు పెరుగుతున్నాయి.
అది నీటి వలన సౌలభ్యం పెరగడం కారణంగా సాధ్యమౌతుంది. సభ్యత్వ నమోదులలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కార మార్గాలను చేయాలని అధికారులను కోరారు. సమస్యలున్న వాటిని అధిగమించి వెయ్యి సొసైటీలు పెరిగాయి. మారిన పరిస్థితుల బదులుగా ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టాలి. బ్యాంకులలో సొసైటీల సభ్యత్వం డిపాజిట్ 5 వేలకు తగ్గించాలి. కిసాన్ క్రెడిట్ కార్డు అర్థవంతంగా వినియోగించుకోవాలి అని మత్స్య రైతులకు సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో చేపలు ఎలా పెంచాలి అనే విషయాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించుకోవాలి. 33 జిల్లాలలో సొసైటీల ఏర్పాటు ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుంది. ఆన్లైన్ సిస్టం మీసేవ ఈ సేవ ద్వారా నిర్ణీతమైన కాలంలో సభ్యత్వం పూర్తి చేసేలా చూడాలి. మత్స్యకారుల సమస్యల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్‌ను సమర్థవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా హెల్ప్ లైన్ సెంటర్ పనిచేయాలి. ట్యాంక్ బండ్ పైన ఫిష్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో , పట్టణ కేంద్రాలలో కనీసం 1000 ఫిష్ ఫుడ్ సెంటర్స్ ప్రారంభించాలి.
సీడ్ ఉత్పత్తి మనమే స్థానికంగా ఉత్పత్తి చేసే స్థాయికి రావాలని కోరారు. ఉత్పత్తి ఉత్పాదకత సంవత్సరంలో కనీసం లక్ష టన్నులు పెంచుకోవాలి చేపల ఆహారం వినియోగంపై మహిళా మత్స్యకారులకు సంఘాలు కృషి చేయాలి కనీసం 6000 మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన మత్స్య కారులకు జాతీయ మత్స్య కారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన హెల్ప్‌లైన్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యకారులకి వృత్తిపరంగా సమస్య చెప్పుకోవడానికి ఫోన్ చేయాలన్నారు.
ఆసమస్య పరిష్కరించడానికి 60 రోజులలో సమస్య పరిష్కారం కాకుంటే అప్పుడు మేమే మీతో సంప్రదిస్తాం.. ఈ సౌకర్యాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో మత్స్యకారులకి ఈ జాతీయ మత్ప్య రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ సందర్భంగా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. ఈకార్యక్రమంలో కమిషనర్ లచ్చి రామ్ భూక్యా, అడిషనల్ డెరైక్టర్ రాథోడ్ శంకర్, డిడిలు లక్ష్మినారాయణ, శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీనివాస్, వివిద జిల్లాల మత్స్య శాఖ అధికారులు, మహిళా మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాల సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .