వడ్డెర సంఘం నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

వడ్డెర సంఘం నుండి
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

హైదరాబాద్, మే 5 (విశ్వం న్యూస్) : వడ్డెర జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సిం హా రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ చైర్మెన్ కె.నరేందర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానే శ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వడ్డెర కమిటీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. గండిపేట మండల అధ్యక్షులు కె. అశోక్ యాదవ్, మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ వడ్డెర కమిటీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు స్వాగత శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో వడ్డెర ప్రజలకు అభివృద్ధి చెందకుండా 15 శాతం ఉన్న రిజర్వేషన్ ను 3 శాతం చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ తగ్గించిపై శాచిక ఆనందం పొందుతున్నారని, అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో నిత్యవసర ధరలు కానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరుపేద కుటుంబాలకు సకల ధరలలో ఉండేవి కానీ రాష్ట్రంలో బిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కష్టకాలంలో ఉన్న ప్రజలు నడ్డిని విరుస్తున్నారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, నిరుద్యోగులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గ్రామాల్లో నేటికి కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మి నారా యణ, పద్మ రావు, శ్వేతా కిరణ్, మీనా ముత్యాలు, జ్యోతి మల్లేష్, పురుషోత్తం, ఆంజనేయులు కార్పొరేటర్లు తాజుద్దీన్, జానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి, మాల్యాద్రి నాయుడు, కస్తూరి సతీష్, మైనారిటీ అధ్యక్షులు షైక్ హాజీ అఖిల్, జగన్, శరత్, సాబేర్, పృథ్విరాజ్, కాంగ్రెస్ పార్టీలో చేరినవారు వడ్డెర సంఘం అధ్యక్షులు ఇ చంద్రయ్య, జాయింట్ సెక్రటరీ ఏం శివయ్య, ఇ బాలకృష్ణ, వి శివ, ఆర్ శ్రీను, నగేష్ తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *