హైదరాబాద్‌:డబుల్ డెక్కర్ బస్సులు.. ఉచిత ప్రయాణం

హైదరాబాద్‌:డబుల్ డెక్కర్
బస్సులు.. ఉచిత ప్రయాణం

  • రూట్లు:ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌
  • రూ.13 కోట్లతో 6 డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసిన హెచ్ఎండీఏ
  • కొన్ని రోజుల పాటు ఉచితంగానే ప్రయాణించే అవకాశం

హైదరాబాద్‌, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్వట్టర్ వేదికగా వెల్లడించారు.

రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.అయితే ఎట్టకేలకు ఈ బస్సులు తిరిగేలా కొన్ని రూట్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.

ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలు దేరి ఆయా రూట్లల్లో తిరుగుతూ మళ్లీ తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయి. కొన్నిరోజుల పాటు ఈ బస్సులో ఉచిత ప్రయాణమే ఉండనుంది. ఆ తర్వాత కనీస ఛార్జి విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *