గంధంగూడలో సర్వే నంబర్ 86 లోని 6.3 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

గంధంగూడలో సర్వే నంబర్ 86 లోని 6.3 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ

హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : జలమండలి భూమికి హైడ్రా రక్షణ కల్పించింది. రంగారెడ్డి జిల్లా గంధంగూడలో సర్వే నంబర్ 86 లోని 6.3 ఎకరాల ప్రభుత్వ భూమిని జలమండలికి అధికారులు కేటాయించారు.

ఇందులో పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు.

భవిష్యత్తులో ఈ భూమి విలువ సుమారు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *