కుటుంబం పూర్తి బాధ్యత నాదే…. చరవాణిలో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
గోవిందరావుపేట, జనవరి 10 (విశ్వం న్యూస్) : ఉద్యమకారుడు దివంగత నాయకుడు మల్లికార్జున్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఐటి పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం మల్లికార్జున్ భార్య పిల్లలతో మంత్రి కేటీఆర్ చరవాణిలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ తెలంగాణ రాష్ట్ర రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి లు మల్లికార్జున్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చరవాణిలో మల్లికార్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన తెలంగాణ మలి దశ ఉద్యమకారులు గజ్జి మల్లికార్జున్ కుటుంబనికి అండగా ఉంటాను అని, పిల్లల చదువులతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత చూసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మల్లికార్జున్ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు. వీరి వెంట గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మండల అధ్యక్షులు సురపనేని సాయిబాబు, ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహ నాయక్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ ఎంపీటీసీ స్వరూప నాయకులు కీర్తి రవి పార్టీ మండల, జిల్లా, నియోజకవర్గ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.