రేపటిలోగా చేరకుంటే.. ఉద్యోగం తొలగింపు

హైదరాబాద్, మే 8 (విశ్వం న్యూస్) : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. మే 09వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

2019 ఏప్రిల్‌ 12న విధుల్లో చేరిన జేపీఎస్ లను మూడేళ్ల ప్రొబెషనరీ కాలం తర్వాత రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మరో ఏడాది ప్రొబెషనరీ కాలాన్ని పెంచింది. మొత్తం నాలుగేళ్లు ప్రొబేషనరీ కాలం ముగిసినా.. ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్‌ చేయడం లేదు.

  • మే 9వ తేదీ, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం
  • ఒకవేళ, 9 మే, 2023 సాయంత్రం 5 గంటలలోపు తమ డ్యూటీలో చేరకపోతే, చేరని వారిని తొలగిస్తాం
  • జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసు
  • నోటీసులు జారీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
  • జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే
  • జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం
  • ప్రభుత్వంతో జేపీఎస్ లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
  • “జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను” అని సంతకం చేశారు.
  • ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదు
  • ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ, jps లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు
  • చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుండి సమ్మెకు వెళ్ళారు
  • నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జెపిఎస్ లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు
  • అయితే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో జెపిఎస్ లకు చివరి అవకాశాన్ని ఇస్తున్నది
  • మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది
  • నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *