ఇస్లాంపురలో ఇఫ్తార్ విందు

ఇస్లాంపురలో ఇఫ్తార్ విందు

విశ్వం న్యూస్ , ఫిబ్రవరి 26 : రంజాన్ మాసం సందర్భంగా ఇస్లాంపురలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రోంటాల సుహాసిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వడ్లూరి విజయకుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రొంటాల సుహాసిని మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, నెల రోజులపాటు కఠిన నియమాలతో అల్లాను ప్రార్థించే ముస్లింల భక్తి విశేషమని పేర్కొన్నారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు.
వడ్లూరి విజయకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం సోదర భావాన్ని పెంపొందించి లౌకిక విలువలను కాపాడుతుందని అన్నారు.

ఈ ఇఫ్తార్ విందులో జామే మస్జిద్ ఈద్గా & ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మక్కా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీమ్, మాజీ అధ్యక్షుడు ఖాజా బద్రోద్దీన్, మక్కా మస్జిద్ ఇమామ్ సోహెల్తో పాటు ముస్లిం నాయకులు సయ్యద్ సలీం, మహమ్మద్ బాషుమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ సర్వర్, మహమ్మద్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *