బోడుప్పల్ నారాయణ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

బోడుప్పల్ నారాయణ స్కూల్ లో
గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

  • 1వ తరగతి విద్యార్థులకు పట్టభద్రుల పత్రాలు పథకాలు అందజేత
  • ఎన్జి జోన్ ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపాల్ సత్యవాణి హాజరు

పీర్జాదిగూడ, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్జీ జోన్ ఏజీఎం బాల పరమేశ్వర్, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని ,ఈ కిడ్జ్ కో ఆర్డినేటర్ నూర్జహాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పట్టు సాధించాలని సందేశాన్ని అందించారు.

దీనిలో భాగంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు విద్యార్థులకు వారి పట్ట బద్రుల పథకాలను పత్రాలను అందజేశారు. ఈ వేడుకకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విచ్చేసి విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఏఓ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

బోడుప్పల్ నారాయణ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాణి ఆధ్వర్యంలో స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్జీ జోన్ ఏజీఎం బాల పరమేశ్వర్, కోఆర్డినేటర్ నూర్జహాన్, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని విచ్చేసి జ్యోతి ప్రజలను చేశారు. ఈ సందర్భంగా పిపి 2 విద్యార్థులకు ఒకటవ తరగతిలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి పట్టభద్రుల పత్రాలు, పథకాలను అందజేశారు.విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *