బోడుప్పల్ నారాయణ స్కూల్లో
మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ ప్రోగ్రాం
బోడుప్పల్, మార్చి 25 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ నారాయణ కాన్సెప్ట్ పాఠశాలలో మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు, డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ కొండ నాగేశ్వరరావు, జనరల్ మేనేజర్ ఆఫ్ నారాయణ విద్యాసంస్థలు గోపాల్ రెడ్డి, ఎన్ జి జోన్ ఏజీఎం బాల పరమేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి, కో ఆర్డినేటర్స్ లక్ష్మీ భవాని, నూర్ ఖాన్, అకాడమిక్ ఇంచార్జ్ ఆజాద్ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో ఆంగ్లభాష నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, చదువుతో పాటు విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు వారికి వచ్చిన బహుమతులు, ప్రశంస పత్రాలను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు స్టాప్, ఎఓ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.