బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్.గూడూరు చెన్నారెడ్డి

బంగారు మైసమ్మ ఆలయంలో
ప్రత్యేక పూజలు నిర్వహించిన
డాక్టర్.గూడూరు చెన్నారెడ్డి

హైదరాబాద్, జూలై 17 (విశ్వం న్యూస్) : బోరబండ మధురానగర్ బంగారు మైసమ్మ, బంగారు పోచమ్మ దేవాలయంలో బోనాల సందర్భంగా మొక్కులు తీర్చుకున్న ఆలయ చైర్మన్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. గూడూరు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ బోనాల సందర్భంగా అమ్మవారి కటాక్షంతో భారత దేశంలోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి భయంకర వ్యాధులు గాని అనారోగ్యాలు గాని రాకుండా ప్రజలందరూ సుఖ శాంతులతో, చిరునవ్వుతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు, ప్రత్యేక బోనాలు సమర్పించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భముగా కాలనీ అభివృద్ధి గురుంచి మాట్లాడుతూ బోరబండ మధురానగర్ బస్తీ ఎన్నో ఒడిదుడుకుల మధ్యన ఏర్పడిన బస్తి నేటికీ 43 సంవత్సరాలు కావస్తుంది. ఎలాంటి కనీసమైన సదుపాయాలు లేనటువంటి స్థలంలో, ప్రాణాలకు సైతం లెక్క చేయక గుడిసెలు వేసుకొని నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం వల్ల పట్టాలు పొంది క్రమ క్రమంగా మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్, రోడ్లు, ఎలక్ట్రిక్ సిటీ, కమ్యూనిటీ హాల్ స్థలము, అక్కడ అంగన్వాడి స్కూల్ ఏర్పాటు చేసుకోవడం అదే క్రమంలో అన్ని మతస్తులు సామరస్యంతో ఉంటూ గుళ్ళు, మసీదు, చర్చ్ లాంటి వాటికి స్థలాలు కేటాయించుకొని మతసామరస్యాన్ని చాటుకుట్టు స్థానికులకు ఇష్ట దైవాలైన బంగారు మైసమ్మ, బంగారు పోచమ్మల గుళ్ళ నిర్మాణం చేసుకొని జీవనం సాధిస్తున్న వారితో నాటి నుంచి నేటి వరకు బస్తీకి అడ్వైజర్ గా అండగా ఉంటు మీతో కలిసి ప్రయాణం చేయడం నా అదృష్టం భావిస్తున్నాను.

ఈ సందర్భముగా కాలనీ వాసులు మాట్లాడుతూ మా బ్రతుకులు ఎలాగో చాలీచాలని సంపాదనతో బ్రతుకు ఈడుస్తున్నాము. మా పిల్లలనైన చదివించుకుందామంటే మా బస్తిలో స్కూల్ నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాల అయిన కూడా బిల్డింగ్స్ కాలాలు, స్లాబుల దశలోనే ఉంది ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగా పూర్తి చేయించవలసిందిగా గూడూరు డా. చెన్నారెడ్డికి మనవి చేశారు. మీ సమస్యని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బస్తి పెద్దలు పి. వీరయ్య, రాములు, నరసింహులు, జి. మహేందర్ రెడ్డి, యాక్టర్ సురేష్ బాబు, టెలిఫోన్ నరసింహులు, దీపక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *