ఇరవై నాలుగు డివిజన్ లో
గడప గడపకు కాంగ్రెస్

- అస్తవ్యస్తంగా రోడ్లు మురికి కాలువలు
- ప్రజల అవస్థలు పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, జూలై 30 (విశ్వం న్యూస్) : ఇరవై నాలుగవ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లిన క్రమంలో సమస్యలను చెబుతున్నారని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మురికి కాలువలు దెబ్బ తిన్నాయని ఎన్నిసార్లు అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడంలేదని ప్రజలు వాపోతున్నారని అన్నారు.

సుభాష్ నగర్ రోడ్డు పై ఇసుక పోసి మూడు నెలలు గడిచినా పనులు ప్రారంభిస్తలేరని ద్విచక్ర వాహనదారులు జారి పడుతున్నారని తీవ్ర గాయాలపాలవుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో నాయకులు కుర్ర పోచయ్య, సర్వర్( చోటు), గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్, దండి రవీందర్, ముస్తాక్, ముల్కల కవిత, అబ్దుల్ బారి సలీముద్దీన్, దీకొండ శేఖర్, కాంపల్లి కీర్తి కుమార్, దన్నా సింగ్, బత్తిని చంద్రయ్య గౌడ్, షబానా మహమ్మద్, షహేన్షా చాంద్, మామిడి సత్యనారాయణ రెడ్డి, సుంకరి గణపతి, మాలోతు మహాలక్ష్మి, ఊరడి లతా, జ్యోతి, సానాది వెంకటేష్, భాస్కరు, పోరండ్ల రమేష్, కుంభాల రాజ్ కుమార్, పరదాల లింగమూర్తి, హనీఫ్ ఇమామ్, శ్రీధర్, కమల్, బషీరుద్దీన్, శారద తదితరులు పాల్గొన్నారు.