కన్నుల పండువగా స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

కన్నుల పండువగా స్వతంత్ర్య
భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

హైదరాబాద్ (విశ్వం న్యూస్) : స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు వేదిక ప్రాంగణం చేరుకున్న సిఎం గారికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం గారు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన చేశారు. వేదిక వద్దకు చేరుకున్న సిఎం గారు, వేదిక ముందు ఏర్పాటు చేసిన గాంధీ మహాత్ముడి విగ్రహానికి , భరత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాల వీక్షణం కోసం ఆసీనులైనారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *