జమ్మికుంట:అవకతవకలతో
కూడిన డిప్యూటేషన్లును
వెంటనే రద్దు చేయాలి
జమ్మికుంట, ఆగస్టు 24 (విశ్వం న్యూస్) : జిల్లాలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జిల్లా విద్యాధికారి ఇచ్చిన డిప్యూటేషన్లలో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్యను ఆధారంగా చేసుకుని మార్గదర్శకాలను అనుసరించకుండా వర్క్ అడ్జస్ట్మెంట్ అంటూ ఇష్టారీతిన డిప్యూటేషన్లు చేశారని పైరవీలు చేయించుకున్న వాళ్లకు అనుకూలమైన చోట పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని. ఈ అవగతవకల డిప్యూటేషన్లను రద్దుచేసి మార్గదర్శకాలతో కూడినటువంటి పునరుత్తరువులు ఇవ్వాలని డిటిఎఫ్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ నరహరి, జిల్లా కార్యదర్శి ఎ శ్రీనివాస్, ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ జమ్మికుంట మండలంలో ఒక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పది లోపు ఉపాధ్యాయులు తొమ్మిది మంది అక్కడ ప్రధానోపాధ్యాయుడు ఎంఎన్ఓ గా విధులు నిర్వహిస్తున్నారని కారణంతో అక్కడికి ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుని డిప్యూటేషన్ ఇచ్చారన్నారు. కానీ ఒక పాఠశాలలో 80 లోపు విద్యార్థులు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ఒకరిని కూడా తీయలేదు వేరే ప్రాథమిక పాఠశాలలో సుమారు 65 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు.
అక్కడ కేవలం ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడికి కనీసం ఇద్దరు టీచర్లు అవసరం ఉన్నప్పటికీ పంపలేదు. ఇల్లందకుంట మండలంలో ఒక ప్రాథమిక పాఠశాలలో 108 మంది విద్యార్థులు ఉన్న ముగ్గురే ఉపాధ్యాయులు ఉన్నారు.
అక్కడికి ఒకరిని కూడా పంపలేదు అలాగే రెండు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు లేరని తెలిసినప్పటికీ అక్కడికి తెలుగు బోధించే ఉపాధ్యాయులను నియమించలేదు. ఈ సంఘటనలన్నీ కూడా ఉదాహరణలు మాత్రమే జిల్లావ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయని డిప్యూటేషన్లను రద్దుచేసి సరైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.