బండి సంజయ్ సూచనతో పేపర్ లీకయితే అది మీవైఫల్యం కాదా

  • లక్షలాది తల్లిదండ్రుల, విద్యార్థుల ఉసురు రెండు అధికారపార్టీలకు తగులుతుంది
  • తెలంగాణను మరో బీహార్ చేయాలని బిజెపి చూస్తే మీరు గాడిదల పళ్ళు తోముుతుండ్రా
  • బండి సంజయ్ ప్రతిసారి అరెస్టు డ్రామాకు కరీంనగర్ నే ఎందుకు ఎంచుకుంటుండు
  • బండి, గంగులపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి ఫైర్

కరీంనగర్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉండి భాధ్యతతో వ్యవహరించాల్సిన నాయకులు ప్రశ్న పత్రాల లీకేజికి కారణం మీరంటే మీరని లక్షలాది తల్లిదండ్రుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను మరో బీహార్ చేయాలని బిజెపి చూస్తుందని కమలాకర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని బిజెపి బీహార్ చేయాలని చూస్తే మీరు గాడిదల పళ్ళు తోముతున్నారా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రతి సారి అరెస్టు డ్రామా కరీంనగర్ కేంద్రంగా నడిపియ్యడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.

గంగుల, బండి చీకటి ఒప్పందంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వీరిద్దరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్న పత్రాలు లీకవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయితే, లీకైన పేపర్ బండికి చేరడం బండి బాధ్యత మరచి అరెస్టు డ్రామా రక్తి కట్టించడం ప్రజలు గమనిస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో మడుపు మోహన్, శ్రవణ్ నాయక్, లింగంపల్లి బాబు, పోరండ్ల రమేష్, కంకణాల అనిల్ కుమార్, ముక్క భాస్కర్, దన్న సింగ్, షబానా మహమ్మద్, హనీఫ్, మామిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *