ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..? : హరీష్‌రావు

భువనగిరి, జనవరి 11 (విశ్వం న్యూస్) : భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడంపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. “భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడులు వంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. యథా రాజా తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం?. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీరు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా?.

సమాధానం చెప్పలేక దాడులా?

భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..”ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారు. కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించింది. ఇది అత్యంత హేయమైన చర్య. ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారింది. దాడులు, గుండాగిరి తమ మార్కు పాలనని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. మా పార్టీ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *