పండుగకు గంగులను ఆహ్వానించిన
గౌడ్ సంఘం నాయకులు

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : ఈనెల 25న కరీంనగర్ లో జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ కు హాజరు కావాల్సిందిగా బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ని కరీంనగర్ గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ ఉత్సవం కోసం మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో గౌడ కులస్తులతో కలిసి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కోడూరి సత్యనారాయణ గౌడ్, కోడూరి లక్ష్మణ్ గౌడ్, కోడూరి హరికృష్ణ గౌడ్, గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, సుదగోని ఆంజనేయులు గౌడ్, బత్తిని రాజు, బత్తిని శ్రీనివాస్, బత్తిని కన్నయ్య, నాగుల కిరణ్ గౌడ్, మార్క రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.