- సీఎం జగన్ పైకి రాయి విసిరిన ఆగంతకులు..
ఆంధ్రప్రదేశ్ , ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : ఎన్నికలకు సిద్దమైన అధికార వైసీపీ మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేస్తోంది. ఏపీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఈకార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బస్సుయాత్రలో వస్తున్న జగన్‌ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు విసిరారు. ఆగంతకుడు విసిరాయి సీఎం జగన్ నదుటిపైన ఎడమ కంటి పైన గాయమైంది. రక్తస్త్రావం అవుతుండగా వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు.
అనంతరం కూడా యాత్ర కొనసాగించారు జగన్. సీఎంపై దాడి జరిగిన సమయంలో బస్సుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా గాయమైంది. సీఎం సెక్యురిటీ సిబ్బంది దాడి చేసిన వారి వివరాలు, ఫోటోలు సేకరించే పనిలో పడ్డారు.