ఆ సీఐ గాండు గాడు… నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా రా… నువ్వు అంత మోగొనివా… (వీడియో)

  • పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి వ్యాఖ్యల వివాదం – పోలీసులపై దూషణలు, సంగారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తత

సంగారెడ్డి, ఫిబ్రవరి 11, 2026 (విశ్వం న్యూస్) : సంగారెడ్డి పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పోలీసుల విధుల పట్ల గౌరవాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఆయన మాట్లాడినట్లు వీడియోలు, ఆడియోలు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

“ఆ సీఐ గాండు గాడు… నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా రా… నువ్వు అంత మోగొనివా… టిఆర్ఎస్ వొల్ల…” అంటూ బహిరంగంగా దూషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సంయమనం పాటిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు–పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణ కారణంగా కొంతసేపు ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 62.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అసలు వివాదానికి కారణం 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నారన్న ఆరోపణలేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఐ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి ఆవేశంతో వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సీఐ సదరు అభ్యర్థి గల్లా పట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ వార్త తెలియగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

పోలింగ్ బూత్ వద్దకు రాగానే జగ్గారెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఓటింగ్‌ను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ బలవంతంగా బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ పెను ఘర్షణ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *