పంచాయతీ తీర్పులో అన్యాయం
జరిగిందని అంకయ్య ఆత్మహత్య

హుజురాబాద్ ఆర్సి, జూన్ 20 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన ఆకుల అంకయ్య, s/o నర్సయ్య వయస్సు 63 సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం తేదీ :18-06 -2023 రోజున భూమి గురించి జరిగిన పంచాయతీలో తనకు పంచాయితీ తీర్పులో అన్యాయం జరిగిందని తన తమ్ముడు ఆకుల రాజయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అందువల్ల మానసిక వేదనకు గురై మంగళవారం ఉదయం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్లి పక్కనే ఉన్న తన పాత ఇంటిలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిపడినట్లు మృతుడి భార్య ఆకుల రాజేశ్వరి, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.