జమ్మికుంట:బతుకమ్మ-బోనాలతో
ఉత్సవాలు వైభవంగా చేయాలి

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
జమ్మికుంట, జూన్ 7 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఉత్సవాలను వేడుకగా చేయాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయంలో అర్.పి లకు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ మన ఊరు – మన చెరువు, బతుకమ్మ – బోనాల కార్యక్రమం ఈ నెల 8న గురువారం రోజున నిర్వహించే బతుకమ్మ, బోనాల కార్యక్రమాలను అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులను, ఓ.బిలతో హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్.పి లు, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.