జమ్మికుంట:రామ లాస్యకు
ఇంటర్ లో స్టేట్ 5 ర్యాంక్

జమ్మికుంట, మే 14 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన రామ విజయ్ కూతురు రామ లాస్య ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 5 వ ర్యాంక్ సాధించింది. 470 మార్కులకు గాను 464 మార్కులు పొంది, రాష్ట్ర స్థాయిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 5వ ర్యాంక్ సాధించింది. ఇంటర్ లో ఎస్.అర్ హన్మకొండలో విద్యను అభ్యసిస్తుంది. లాస్య మొదటి నుండి చదువులో చురుకుగా ఉంటూ పెద్దల పట్ల మర్యాదతో నడుచుకుంటూ తండ్రి పేరు నిలబెడుతుంది అని ఈ సందర్భంగా లాస్యను పుర ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.