జమ్మికుంట:రోడ్డు విస్తరణకు
ఎవరైనా సహకరించాలి
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు
జమ్మికుంట, జూన్ 7 (విశ్వం న్యూస్) : స్వల్ప కాలంలోనే క్రమంగా పెరుగుతున్న పట్టణ జనాభా పెరుగుతున్న దృష్ట్యా రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు అన్నారు.
జమ్మికుంట పట్టణ పరిధిలో చౌరస్తా విస్తరణలో భాగంగా కాకతీయ స్కూల్ దగ్గర గల పత్తి మార్కెట్ వెళ్లే దారి కమాన్ ను తొలగించి చౌరస్తా విస్తరణకు సహకరించాలని కాకతీయ స్కూల్ యాజమాని అవిర్నేని సుధాకర్ రావు , రూరల్ సి.ఐ సురేష్ లను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కాకతీయ స్కూల్ యాజమాని, సుధాకర్ రావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.