జమ్మికుంట:తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలుఎం.అర్.ఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో..పోలీస్ స్టేషన్ సి.ఐ రమేష్ ఆధ్వర్యంలో..బి.అర్.ఎస్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో..కాంగ్రెస్ పార్టీ మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో..బి.జె.పి జి.డి మల్లేష్ అధ్వర్యంలో…

జమ్మికుంట:తెలంగాణ
రాష్ట్ర అవిర్భావ వేడుకలు

జమ్మికుంట, జూన్ 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని వివిధ శాఖల
కార్యాలయాలలో జాతీయ పతాకావిష్కరణ జరిపి, పాలాభిషేకాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

జమ్మికుంట ఎం.అర్.ఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశానుసారం ఎం.అర్.ఓ బండి రాజేశ్వరి, అధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ ఆదేశానుసారం సి.ఐ రమేష్ అధ్వర్యంలో
ఘనంగా వేడుకలు నిర్వహించారు.

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం అవరణలో తెలంగాణ తెచ్చింది బి.అర్.ఎస్
అంటూ పతాకావిష్కరణ చేసి ఘనంగా వేడుకలు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు అధ్వర్యంలో నిర్వహించారు.

గాంధి చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు మొలుగూరి సదయ్య అధ్వర్యంలో తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అంటూ సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

పి.ఏ.సి.ఎస్ కార్యాలయ ఆవరణలో అధ్యక్షులు పోనగంటి సంపత్ జాతీయ పతాకావిష్కరణ చేసి
ఘనంగా వేడుకలు నిర్వహించారు.

బి.జె.పి జి.డి మల్లేష్ జాతీయ పతాకావిష్కరణ చేసి తెలంగాణ బిల్లు పాస్ మద్దతు ఇచ్చి, బిల్లు పాస్ కావడానికి సుష్మా స్వరాజ్ పాత్ర ఉందంటూ కొనియాడుతూ ఘనంగా వేడుకలు నిర్వహించారు.

గాంధి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు (మాజీ మార్కెట్ వైస్ చైర్మన్) గూడెపు
సారంగపాణి అధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *