జయప్రదకు జైలు శిక్ష
చెన్నై, ఆగస్టు 11 : ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది.
చెన్నైలోని రాయపేటలో మాజీ ఎంపీ జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపించారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో థియేటర్ ను బంద్ చేశారు.
ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక భీమా కార్పోరేషన్ కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటు మరో ముగ్గురికి రూ.5 వేల జరిమానా కూడా విధించింది.