జర్నలిస్ట్ అక్రిడేషన్స్ అంగట్లో వస్తువులా అమ్ముతున్నారు

జర్నలిస్ట్ అక్రిడేషన్స్ అంగట్లో
వస్తువులా అమ్ముతున్నారు

(జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సీనియర్
జర్నలిస్టు అంబాల ప్రభాకర్ (ప్రభు)
జమ్మికుంట, ఆగస్టు 14 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అంబాల ప్రభాకర్ ప్రభు అక్రిడేషన్స్ అర్హులైన జర్నలిస్టులను విస్మరించి అనర్హులకు, ఐఎన్ పిఅర్. మత ప్రాతిపదికన కొందరికి మత సామాజిక వర్గానికి అక్రిడేషన్లు ఇవ్వడం జరిగిందని. తక్షణమే విచారణ జరిపి నిజా నిజాలను తెలుసుకొని అక్రిడేషన్ కమిటీలకు సంబంధం లేకుండా అక్రిడేషన్ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ వెంటనే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు కల్పిస్తున్నటువంటి నివేశన స్థలాలు కానీ హెల్త్ కార్డ్స్ గాని ఇవ్వడం వలన ఇతర జిల్లాల నుండి ఎలాంటి అనుభవం లేని అర్హత లేని వ్యక్తులకు 20వేల నుండి 60 వేల వరకు అంగట్లో వస్తువుల అక్రిడేషన్ లో అమ్ముకున్నారని, స్థానిక జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూ అర్హత ఉండి వివిధ పత్రికలలో వివిధ ఛానల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అక్రిడేషన్ కమిటీ నిజమైన జర్నలిస్టులను విస్మరించి అనర్హులకు అక్రిడేషన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనర్హులపై చర్యలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని స్థానిక జిల్లా అయినటువంటి అర్హులైన జర్నలిస్టులకు మూడవ విడుదల అక్రిడేషన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నర్సిని కేదారి, పడాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *