జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

జర్నలిస్టులు అందరికీ
ఇళ్ల స్థలాలు కేటాయించాలి

మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక
అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్
వీణవంక, జూలై 21 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని పత్రికా విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎండి సాహెబ్ హుస్సేన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అక్రిడేషన్ తోని సంబంధం లేకుండా వార్త సేకరించే ప్రతి విలేఖరికి ఇళ్ల స్థలం ఇవ్వాలని మరి ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు సేకరించి ప్రతిరోజు ప్రజల ముంగిట్లో ఉంచే చిన్న చిన్న పత్రికలను ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పక్కకు పెట్టడం చాలా బాధాకరం.

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లందరికీ ఉప ఎన్నికల సమయంలో ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూములు ఇస్తానని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు వారికి మొండి చేయి చూపడం సిగ్గుచేటు.

తక్షణమే విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు ఇప్పించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేయించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *