డిస్టిక్ స్పోర్ట్స్,గేమ్స్ మీట్ లో… విజయదుందుభి మోగించిన జ్యోతిష్మతి విద్యార్థులు

డిస్టిక్ స్పోర్ట్స్,గేమ్స్ మీట్ లో… విజయదుందుభి మోగించిన జ్యోతిష్మతి విద్యార్థులు

తిమ్మాపూర్, జనవరి 9 (విశ్వం న్యూస్) : జిఎంఆర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఉమెన్స్ పాలి టెక్నిక్ కళాశాల, కరీంనగర్ లో ఈ నెల 5,6 తేదీలలో జరిగిన డిస్టిక్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ -2023 లో జ్యోతిష్మతి కళాశాల ఫిజి కల్ డైరెక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ క్రీడలలో పాల్గొన్న జ్యోతిష్మతి క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా సోమవారం జ్యోతిష్మతి కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాస రావు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆట పోటీలలో జ్యోతిష్మతి విద్యార్థులు కబడ్డీ, కోకో, టేబుల్ టెన్నిస్, చెస్, త్రిపుల్ జంప్, షార్ట్ పుట్ 400 మీటర్ రన్ లలో పాల్గొని విజేతలుగా సుమారుగా 40 మంది విద్యా ర్థులు బహుమతులు అందుకోవడం కళాశాలకే గర్వ కారణమని జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు, విజేతలకు హృదయపూర్వక అభినంద నలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *