కనకదుర్గ చిట్ ఫండ్
డైరెక్టర్ ఆత్మహత్య

హన్మకొండ, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో కనకదుర్గ చిట్ ఫండ్స్ డైరెక్టర్ నల్ల భాస్కర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫ్యాన్ కి చున్నీ తో ఉరేసుకొని మధ్యాహ్నం ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కనకదుర్గ చిట్ఫండ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.