కరీంనగర్:ఘనంగా స్వర్గీయ
రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి

- సాంకేతిక విప్లవం తీసుకువచ్చి, 18 సంవత్సరాలకి యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిదే – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో, మే 21 (విశ్వం న్యూస్) : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణగారు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ గార్లతోపాటు నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి,టెలిఫోన్ సౌకర్యం లేనటువంటి గ్రామాలు కూడా ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యాలు పొందుతున్నాయి అంటే అది రాజీవ్ గాంధీ గారి కృషి అని, మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లు,లాప్టాప్ లు, టీవీలు,సెల్ ఫోన్లు, మరియు ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క ఘనత అని చెప్పుకోవచ్చుఅని ఆయనకు జిల్లా కాంగ్రెస్ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.

కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు యువతకు స్ఫూర్తిగా, మార్గదాయకంగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ,వారి ఆశయాలను కొనసాగించడానికి కంకణ బద్ధులవుతామని,దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే కాకుండా ఈరోజు ఈ టెక్నాలజీని మనము ఉపయోగిస్తున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి చలవేనని అన్నారు.
వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ విప్లవత్మకమైన మార్పులు తీసుకువచ్చి,18 సంవత్సరాలకి యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందన్నారు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ మానవ బాంబుకు బలైన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో నాయకులు ఏం డి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, సమద్ నవాబ్, మడుపు మోహన్, వెన్న రాజ మల్లయ్య, ఎస్ ఏ మోసిన్, కుర్ర పోచయ్య,రామిడి రాజిరెడ్డి, శకుంతల, గడ్డం విలాస్ రెడ్డి, హైమద్ అలీ, లింగంపల్లి బాబు, నూనె గోపాల్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దండి రవీందర్, నిహాల్, విక్టర్, ఎండి చాంద్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పోరండ్ల రమేష్,మామిడి సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ బారి, శబానా మహమ్మద్, అనీఫ్, ముక్క భాస్కర్, ముల్కల కవిత, షహేన్షా, సుంకర గణపతి, కాంపల్లి కీర్తి కుమార్, షేక్ సిరాజ్, శంబయ్య,తదితరులు పాల్గొన్నారు.