కరీంనగర్:దెయ్యాలు వేదాలు
వల్లించడం అంటే ఇదేనేమో

- ఒక కోటి ముప్పై లక్షల ఖర్చుతో అల్యూమినియం ఫ్రేమ్ కాదు బంగారు పూతతో ఫ్రేమ్ పెట్టొచ్చు
- రోప్ బ్రిడ్జి కింద కొట్టుకుపోయిన చెక్ డ్యాంల సంగతేంది మంత్రి గంగుల కమలాకర్
- మేయర్ తో సహా మెజార్టీ కార్పొరేటర్ లు గత పాలక వర్గాలలో ఉన్నవారే వారంతా అవినీతిపరులేనా?
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజం
కరీంనగర్ బ్యూరో, జూలై 19 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్యుమినియం ఫ్రేములు అమ్ముకుంటారని తీగల వంతెన మీద తీగలు అమ్ముకుంటారని వాఖ్యలు చేసిన మంత్రి మాటలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా చౌక్ వద్ద కూడలి అభివృద్ధి పేర మీరు చూపిస్తున్న ఖర్చు ఒకకోటి ముప్పై లక్షలు ఆ డబ్బులతో అల్యూమినియం ఫ్రేమ్ లు కాదు బంగారు పూతతో ఫ్రేములు పెట్టొచ్చు మొదలు దీని సంగతి చెప్పండి అని అదే విధంగా రోప్ బ్రిడ్జి కింద కొట్టుకుపోయిన చెక్ డ్యాంల సంగతేందని ప్రశ్నించారు.
రోడ్లు వెడల్పు చేసింది కాంగ్రెస్ హాయంలోనే అని మీరు అభివృద్ధి పేరు మీద రోడ్లను కుదించి వేస్తున్నారని పాత సర్కస్ గ్రౌండ్ కు చరిత్ర ఉండేదని దాన్ని కమర్షియల్ గా మార్చి, మల్టీ పర్పస్ స్కూలుకు ఆట స్థలం లేకుండా చేసిన ఘనత మీదని ఎద్దేవా చేశారు. బాహ్యవలయం రోడ్లు గాని స్టేడియంగాని పాస్ పోర్ట్ ఆఫీస్ గాని కాంగ్రెస్ హాయంలో జరిగినవి కావా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయంలో అండర్ గ్రౌండ్ పనులు జరిగినవి కాబట్టే స్మార్ట్ సిటీ హోదాకు అర్హత సాధించిందన్న సంగతి తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఎలా కమలాకర్ అని ఎద్దేవా చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న 49,51 డివిజన్ లను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని మీ పార్టీలో ఆధిపత్య పోరుకు ప్రజలను బలి చేయడం భావ్యమా అని నరేందర్ రెడ్డి అన్నారు.
గత ముప్పై సంవత్సరాలుగా పాలకవర్గాలలో ఉన్న వారే ఇప్పుడున్న మేయర్ మెజార్టీ కార్పొరేటర్లు అని మరి మీరు మాట్లాడినవన్ని వారికి వర్తిస్తాయి కదా వారంతా అవినీతి పరులనా మీ ఉద్దేశ్యం అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో దన్న సింగ్, కుర్ర పోచయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, షబానా మహమ్మద్, ముల్కల కవిత, మామిడి సత్యనారాయణ రెడ్డి, షేక్ శేహెన్ష, అన్నే జ్యోతిరెడ్డి, నదీమ్, అష్రాఫ్ ఖురేషి, మహమ్మద్ భారీ, కమల్, తమ్మడి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు.