కరీంనగర్:హ్యాపీ డాక్టర్స్ డే
(వైద్యో నారాయణో హరి)
- మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
కరీంనగర్, జూలై 1 (విశ్వం న్యూస్) : దేవుడు సృష్టించిన ప్రపంచంలో మనకు పుట్టుక నుండి చివరి దశలో ఉన్నంత వరకు కనిపించే ప్రత్యక్ష దైవం అని వైద్య వృత్తి నిర్వహిస్తున్న డాక్టర్స్ అందరికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్.
శనివారం రోజున నేషనల్ డాక్టర్స్ డే ని పురస్కరించుకొని స్వతహాగా ప్రఖ్యాత సర్జన్ అయిన డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ గారిని శాలువాతో సత్కరించారు. కరీంనగర్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ శౌరయ్య గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి లిడియా జయరాణి గారిని ఈ సందర్బంగా సత్కరించారు.
డాక్టర్ వృత్తి ఎంచుకోవడమే చాలా గొప్ప విషయమని ఎందుకంటే కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎక్కువ సమయం కేటాయించలేని వృత్తి వైద్య వృత్తి అని ప్రతీ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వృత్తి వైద్య వృత్తి అని, ఇలాంటి అత్యవసర వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని డాక్టర్లందరిని కొనియాడారు మల్యాల సుజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవీంద్రాచారీ, అనంతగిరి వినయ్, పొన్నం మధు, భరత్, పల్లె సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.