కరీంనగర్:నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్దం

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో
నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్దం

కరీంనగర్ బ్యూరో, జూలై 7 (విశ్వం న్యూస్) : రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటీషన్ ను గుజరాత్ హై కోర్టు తిరస్కరించిన నేపధ్యంలో కావాలని అధికారాన్ని ఉపయోగించుకొని బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ఇందిరా చౌక్ వద్ద దగ్దం చేశారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం లక్షల కోట్లు లాభం చేస్తున్నదాన్ని పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీస్తే సమాధానం చెప్పకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

రాహుల్ గాంధీకి ప్రజల నుండి దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక మోడీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేంద్రం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని తగిన మూల్యం చెల్లించక తప్పదనీ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో శ్రవణ్ నాయక్, ఎం డి తాజ్, సమధ్ నవాబ్ శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, బత్తిని చంద్రయ్య గౌడ్, గడ్డం విలాస్ రెడ్డి, దన్న సింగ్, ఎం డి చాంద్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, ముక్క భాస్కర్, పోరండ్ల రమేష్, దండి రవీందర్, షేక్ శేహెన్ష, నెహాల్ అహ్మద్, సలిమొద్ధిన్, సిరాజొధ్ధిన్, రాజ్ కుమార్, తమ్మడి ఎజ్రా, ముల్కల యొన, బషీర్, కమల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *