కరీంనగర్:నెల రోజులకే కుంగిన కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు

నెల రోజులకే కుంగిన
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు

  • కుంగడం వల్ల పగిలిన సైడ్ వాల్స్, కనిపియ్యకుండా కవర్లు వేసిన కాంట్రాక్టర్
  • నాణ్యత లోపం వల్లే కుంగిపోయింది, విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తాం
  • వాహనాలు వెళ్తే ఇంకా కుంగుతుందని టిప్పర్లను అడ్డు పెట్టి కాపలాగా పోలీసులను పెట్టిండ్రు
  • ఊదర గొట్టిన మంత్రి గంగుల భాధ్యత వహించాలి, చిత్త శుద్ధి ఉంటే విజిలెన్స్ కు ఫిర్యాదు చేయాలి
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్

కరీంనగర్ బ్యూరో, జూలై 28 (విశ్వం న్యూస్) : అభివృద్ధి చాటున జరుగుతున్న అవినీతి వల్ల నాణ్యత లోపించి ప్రారంభించిన నెల రోజులకే ఎక్కడికక్కడ కుంగి పోవడమో పగిలిపోవడమో ఊడిపోవడమో జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నెల రోజులకే కుంగిపోయి సైడ్ వాల్స్ పగిలిపోయాయని కనిపించకుండా ఉండడానికి కవర్లు వేసి దాచే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. వాహనాలు వెళ్లకుండా టిప్పర్ అడ్డంపెట్టి పోలీసులను కావలి పెట్టారని అవినీతి భాగోతం బయట పడకుండా ప్రయత్నం చేస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు.

చిత్త శుద్ధి ఉంటే కాంట్రాక్టర్ పై విజిలెన్స్ కు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే విధంగా మానేర్ రివర్ ఫ్రంట్ చెక్ డ్యాంలు కొట్టుక పోయాయని స్మార్ట్ సిటీ పనులు నాణ్యత లోపం వల్ల ఫుట్ పాత్ టైల్స్ ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయని కూడల్ల అభివృద్ధి చాటున పెద్ద ఎత్తున స్కాం జరిగిందని వీటన్నిటికి మంత్రి గంగుల కమలాకర్ భాధ్యత వహించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, గడ్డం విలాస్ రెడ్డి,దన్న సింగ్, సయ్యద్ ఖంరొద్ధిన్, ఎండి చాంద్,చంద్రయ్య గౌడ్,జీడి రమేష్, దండి రవీందర్, ముక్క భాస్కర్, మెతుకు కాంతయ్య, నెల్లి నరేష్,షేక్ షేహెన్ష, మామిడి సత్యనారాయణ రెడ్డి, కంకనాల అనిల్ కుమార్, తమ్మడి ఎజ్రా, మహమ్మద్ భారీ,శ్రీకర్, ఇమామ్, జిలకర రమేష్, కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *