స్వీపర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోమటిరెడ్డి డిమాండ్

కరీంనగర్:స్వీపర్ల సమస్యలు
వెంటనే పరిష్కరించాలని

కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్

  • జిల్లా, మండల స్కూల్ స్వీపర్లను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం ఇవ్వాలి
  • గత ముప్పై నాలుగు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం

కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 14 (విశ్వం న్యూస్) : జిల్లా,మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం చెల్లించకుండా ఈ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

గత ముప్పై నాలుగు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న రిలే దీక్ష శిభిరానికి సంఘీభావం తెలిపి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 5200 రూపాయల వేతనం తో పూర్తి స్థాయి పనిగంటలు పని చేయించుకోవడం శ్రమ దోపిడీయే అని ఆ వేతనం కుటుంబ పోషణకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.వెంటనే ప్రభుత్వం స్పందించి స్వీపర్ల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం 26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలన్నిటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *