చంద్రబాబుని కలిసిన కర్ణాటక
డిప్యూటీ సిఎం డి.కె శివ కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 28 (విశ్వం న్యూస్) : డీకె శివ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కలవటం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు విమానాశ్రయంలో కలిసిన ఇద్దరు నేతలు… కాసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరి కలయిక… రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరికొద్దిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీనికితోడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు… లెక్కలు వేసుకుంటున్నాయి. వ్యూహలు, ప్రతివ్యూహలను రచించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో…. బెంగళూరు విమానాశ్రయం వేదిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కలవటం హాట్ టాపిక్ గా మారింది.