రంజాన్ వేడుకల్లోపాడి కౌశిక్ రెడ్డి

రంజాన్ వేడుకల్లో పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్స్ పాతకాల రమేష్, కుతాడీ రాజయ్య, గాజుల భాస్కర్, దయ్యాల శ్రీనివాస్, భోగం వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రభుత్వ విప్ బాడీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ఈద్గ కబ్రిస్తాన్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను తక్షణమే మన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. మరియు కబ్రిస్తానికి ఇరువైపులా గులాబీ చెట్ల తోటను మరియు ఇరువైపుల సీసీ రోడ్డును కబ్రిస్తాన్లో పెద్ద లైట్లు అమరుస్తారని హామీ ఇచ్చారు.

ఇక మీద ఏ పనైనా తనకు నేరుగా ఫోన్ ద్వారా అన్న లేదా మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లాలని సభాముఖంగా కోరారు. మరియు ఈ నెలలోపే తక్షణమే పనులు ప్రారంభిస్తారని మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. మరియు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు మత పెద్దలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ చుట్టుపక్కల గ్రామాల ముస్లిం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు, ఎంఏ, ఫిరోజ్, ఖదీర్, అక్బర్, ఏసీ యూసుఫ్, బాబా (సిటీ కేబుల్), షాహిద్, రషీద్, సైఫీ, అయూబ్, జహీద్, తదితరులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *