కొడుకుకు ముద్దుపెట్టి
బయల్దేరిన కవిత

హైదరాబాద్, మార్చి 15 (విశ్వం న్యూస్) : మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు.
అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి బిగించి శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకొని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.