కాజీపేట: ప్రమాదాలు
జరుగుతున్నా పట్టించుకోరేం…?
నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కాజీపేట, ఆగస్టు 28 (విశ్వం న్యూస్) : కాజీపేట సోమిడి శివారులో కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరేం..? అంటూ 62వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్, బిజెపి నాయకులు మేకల శ్రావణ్ యాదవ్ ప్రశ్నించారు. సోమవారం దెబ్బతిన్న రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని ఆయన తో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని చేసిన విన్నపాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఔటర్ రింగ్ రోడ్డుకు రాకపోకలు సాగించే దారి కావడంతో ఈ రోడ్డుపై రద్దీ పెరిగిందన్నారు.
ప్రతిరోజు ఈ ధ్వంసమైనా రోడ్డు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్ద ప్రమాదం జరగకపోతే సంబంధిత అధికారులు ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాయిత రాజ్ కుమార్ యాదవ్, మూల కరుణాకర్ రెడ్డి, కంది నవీన్, మేకల కుమారస్వామి, జక్కుల రమేష్, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.