ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 2026 (విశ్వం న్యూస్) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించేలా పరమశివుడు దీవించాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. సహనం, త్యాగానికి ప్రతీకగా, సృష్టి–లయలకు అధిపతైన ఉమా మహేశ్వరుడు హిందూ మత భక్తులచే నిత్య పూజలందుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు.

భక్తి, శ్రద్ధలతో కొలిస్తే సామాన్య భక్తుల కోరికలను సైతం తీర్చే భోళా శంకరుడిగా పరమశివుడు భారతీయ ఆధ్యాత్మిక–సామాజిక జీవనంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన అన్నారు. ప్రాణికోటిని రక్షిస్తూ సృష్టి మనుగడ కోసం గరళాన్ని మింగిన మహా త్యాగి, ఆది యోగి, గరళకంఠుడు పరమేశ్వరుడని కొనియాడారు.

తెలంగాణ ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని దేవదేవుడైన చంద్రశేఖరుడిని కేసీఆర్ ప్రార్థించారు.

One thought on “ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *