సిట్‌కు కేసీఆర్ లేఖ.. మరో తేదీ కోరుతూ విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 29, 2026 (విశ్వం న్యూస్) : సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సిట్ ముందు హాజరుకాలేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసే కీలక పనిలో పూర్తిగా బిజీగా ఉన్నానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అయితే తనకు అనువుగా ఉండే మరో తేదీని తెలియజేయగలరని సిట్ అధికారులను ఆయన కోరారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని కేసీఆర్ తన ప్రతిస్పందనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *