కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్): కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదం కేసులో కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కన్నారావు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు.
మన్నె గూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొం దరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి గత నెల 3న ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఫిర్యా దు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓఆర్ఎస్ ప్రాజెక్టులకు సంబంధించి వంశీ అనే వ్యక్తికి డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూమిని కన్నారావు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులతో కలిసి తన ఉద్యోగులను బెదిరించి బలవంతంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని బండోజు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కన్నారావుపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కన్నారావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు రిజెక్ట్ చేసింది.ఈ క్రమంలోనే పోలీసులు కన్నారావును అరెస్ట్ చేశారు.