బండి సంజయ్ కు కీలక బాధ్యతలు

- జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్
- జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగింపు
హైదరాబాద్, జూలై 29 (విశ్వం న్యూస్) : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ పధాధికారుల జాబితాను జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. అరుణ్‌సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేసారు.
గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే చర్చ జరిగింది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది.